Shortcuts: WD:INTRO, WD:I
Wikidata:Introduction
వికీడేటా, స్ట్రక్చర్డ్ డేటాను సేకరించి, వికీమీడియా ఉద్యమ ప్రాజెక్టులైన వికీపీడియా, వికీమీడియా కామన్స్ మొదలైనవాటికే కాక, ప్రపంచంలో మరెవరికైనా సరే తోడ్పడే ఉచిత, సహకార, బహుభాషా, ద్వితీయ డేటాబేస్.
దీని అర్థం ఏమిటి?
ప్రారంభ ప్రకటనను మరింత సమగ్రంగా పరిశీలిద్దాం:
- స్వేచ్ఛ. వికీడేటాలోని డేటా క్రియేటివ్ కామన్స్ పబ్లిక్ డొమైన్ డెడికేషన్ 1.0 క్రింద అనేక సందర్భాల్లో తిరిగి వినియోగించుకునేందుకు వీలుగా ప్రచురించబడుతోంది. మీరీ డేటాను చివరకు వాణిజ్య ప్రయోజనాలకు కూడా ఏ అనుమతీ అడగకుండానే కాపీ, మార్పు, పంపిణీ వంటివి చేయవచ్చు.
- సహకార. వికీడేటా ఎడిటర్లు డేటాను చేరుస్తారు. వీళ్ళే డేటాణూ నిర్వహిస్తారు. కంటెంటును సృష్టించడానికీ, నిర్వహించడానికీ కావాల్సిన నియమాలనూ వీళ్ళే ఏర్పరచుకుంటారు. బాట్‌లు కూడా ఇక్కడ డేటాను చేరుస్తాయి.
- బహుభాషలు. ఎడిటింగు, వాడకం, శోధన, పునర్వినియోగం అన్నీ కూడా పూర్తిగా బహుభాషల్లో జరుగుతాయి. ఏ భాషలో చేర్చిన డేటా అయినా సరే, వెనువెంటనే అన్ని భాషల్లోకీ అందుబాటులోకి వస్తుంది. ఏ భాషలోనైనా మార్పుచేర్పులు చెయ్యవచ్చు. దీన్ని ప్రోత్సహిస్తారు కూడాను.
- ద్వితీయ డేటాబేసు. వికీడేటా స్టేట్‌మెంట్లను నమోదు చెయ్యడం మాత్రమే కాదు, వాటి మూలాలను, ఇతర డేటాబేసులతో వాటి కనెక్షన్లనూ నమోదు చేస్తుంది. ఇది ఇక్కడున్న విజ్ఞానపు వైవిధ్యాన్ని ప్రతిఫలిస్తుంది. దాని నిర్ధారకత్వ భావనను బలపరుస్తుంది.
- స్ట్రక్చర్డ్ డేటా సేకరణ. అత్యున్నత స్థాయి స్ట్రక్చర్డ్ వ్యవస్థ వలన వికీమీడియా ప్రాజెక్టులు, మరి ఇతర ప్రాజెక్టులూ సులభంగా వాడుకోగలిగేందుకు, కంప్యూటర్లు తేలిగ్గా "అర్థం చేసుకోగలిగేందుకూ" వీలు కలుగుతుంది.
- వికీమీడియా వికీలకు తోడ్పాటు. వికీపీడియాలో తేలిగ్గా నిర్వహించగలిగే సమాచార పెట్టెల ఏర్పాటులోను, ఇతర భాషల లింకులివ్వడంలోనూ సహకరిస్తుంది. నాణ్యతనూ మెరుగుపరుస్తూ, మార్పుచేర్పుల పనిని కూడా తగ్గిస్తుంది. ఒక భాషలో చేసిన మార్పులు ఇతర భాషలన్నిటికీ అందుబాటులోకి వస్తుంది.
- ప్రపంచంలో ఎవరైనా. వికీడేటా యొక్క అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటరుఫేసు ద్వారా దీన్ని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు.
వికీడేటా ఎలా పనిచేస్తుంది?

వికీడేటా ఓ కేంద్రీకృత స్టోరేజీ ఖజానా. వికీమీడియా ఫౌండేషను నిర్వహించే వికీల వంటి అప్లికేషన్లు దీన్ని ఉపయోగించుకోగలవు. వికీడేటా నుండి డైనమిగ్గా లోడయ్యే కంటెంటును ప్రతీ వికీ ప్రాజెక్టులోనూ విడివిడిగా నిర్వహించనక్కరలేదు. ఉదాహరణకు, గణాంకాలు, తేదీలు, స్థలాలూ వంటి సామాన్య డేటాను వికీడేటాలో కేంద్రీకరించవచ్చు.
వికీడేటా ఖజానా

వికీడేటా ప్రధానంగా అంశాలను కలిగి ఉంటుంది. ఒక్కొక్క అంశానికీ ఒక లేబులు, ఒక వివరణ, ఎన్నైనా మారుపేర్లూ ఉంటాయి. అంశాలు Q
తో మొదలై, ఒక సంఖ్య కలిగి ఉంటాయి. ఉదా: Douglas Adams (Q42).
అంశపు వివరణాత్మక లక్షణాలను స్టేట్‌మెంట్లు వివరిస్తాయి. దీనిలో లక్షణం, విలువ ఉంటాయి. వికీడేటాలో లక్షణాలు P
తో మొదలై, సంఖ్యను కలిగి ఉంటాయి. ఉదా: educated at (P69).
ఓ వ్యక్తికి, అతడు ఎక్కడ చదువుకున్నాడనే లక్షణాన్ని, దానికి ఒక విలువనూ ఇచ్చి, చేర్చవచ్చు. భవనాలకు, అక్షాంశ రేఖాంశాలను చేర్చవచ్చు. లక్షణాలను బయటి డేటాబేసులతో సంధానించవచ్చు కూడా. బయటి డేటాబేసులకు లింకయ్యే లక్షణాన్ని ఐడెంటిఫయరు అంటారు. సైటులింకులు అంశాలను వికీపీడియా, వికీబుక్స్, వికీకోట్ వంటి క్లయంటు వికీలలోని సంబంధిత కంటెంటుతో కలుపుతాయి.
ఈ సమాచారమంతటినీ, అది ఏ భాషలో జనించినా, ఏ భాషలోనైనా చూపించవచ్చు. ఈ విలువలను చూపించేటపుడు క్లయంటు వికీలు అత్యంత తాజా డేటాను చూపిస్తాయి.
Item | Property | Value |
---|---|---|
Q42 | P69 | Q691283 |
Douglas Adams | educated at | St John's College |
వికీడేటాతో పనిచెయ్యడం
అంతర్గత పరికరాలు, బాహ్య పరికరాలు, ప్రోగ్రామింగు ఇంటరుఫేసులు వంటి వాటిని వాడి అనేక విధాలుగా వికీడేటాను చేరుకోవచ్చు.
వికీడేటా అంశాలను వెతికేందుకు, పరిశీలించేందుకూ Wikidata Query, Reasonator లు ప్రజాదరణ పొందిన పరికరాలు. పరికరాలు పేజీలో ఇలాంటి పరికరాల విస్తృత జాబితా ఉంది.
ఎక్కడ మొదలుపెట్టాలి
కొత్తవాళ్ళు వికీడేటా గురించి తెలుసుకునేందుకు వికీడేటా యాత్రలు అత్యుత్తమ స్థలం.
తొలి అడుగుగా కొన్ని లింకులు:
- మీ వాడుకరి అభిరుచులలోని బేబెల్ పొడిగింతలో మీ భాషాభిరుచులను సెట్ చేసుకోండి.
- లేబుళ్ళు, వివరణలలో సహాయం
- అంతర్వికీ ఘర్షణలు, కన్స్ట్రెయింట్ అతిక్రమణల విషయంలో సహాయం
- ఏదో ఒక అంశాన్ని మెరుగుపరచండి
- అనువదించడంలో తోడ్పడండి
నేనెలా తోడ్పడగలను?
పదండి, ఎడిటింగు మొదలు పెట్టండి. వికీడేటా ఆకృతి, భావనల గురించి తెలుసుకోడానికి అదే సరైన పద్ధతి. వికీడేటాను అర్థం చేసుకున్నాకే పని మొదలుపెడదామని అనుకుంటే, సహాయం పేజీలు చూడండి. సందేహాలేమైనా ఉంటే, వాటిని ప్రాజెక్టు చాట్ లో పెట్టండి. లేదా అభివృద్ధి చేస్తున్న బృందాన్ని సంప్రదించండి.
రావాల్సింది ఇంకా ఉంది
వికీడేటా కొనసాగుతూ ఉన్న ప్రాజెక్టు. భవిష్యత్తులో మరిన్ని డేటా రకాలు, పొడిగింతలూ అందుబాటులోకి వస్తాయి. మెటా లోని వికీడేటా పేజీలో వికీడేటా గురించి, దానిలో జరుగుతున్న అభివృద్ధి గురించీ మరింత సమాచారం దొరుకుతుంది. అభివృద్ధికి సంబంధించిన తాజా సమాచారం కోసము, ప్రాజెక్టు భవిష్యత్తుపై జరిగే చర్చల్లో పాల్గొనేందుకూ వికీడేటా మెయిలింగ్ జాబితాకు చందాదారులు కండి.